Raju Naa Balaraju Lyrics - Swathi Reddy
Singer | Swathi Reddy |
Composer | Bheems Ceciroleo |
Music | sony music south |
Song Writer | Kasarla Shyam |
Lyrics
ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసు
వెళ్లలేకపోతుందయ్యో ఆ సంగతి నాకు తెలుసు
ఇన్ని నాళ్ల సంది సూడలేదు ఇంత రంధి
సుట్టు ఉన్న మంది సూపు నిన్ను ఎతుకుతాంది
నువ్వు నవ్వుతుంటే ఏందయ్యో
నా గుండె గుంజుతుందయ్యో
సిత్తరంగ ఉందయ్యో
నా ఎదురంగ నువ్వుంటే బుగ్గల్లో సిగ్గెందయ్యో
రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు
రావేరా.....
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా.... రా.... రా.....
నువ్వు సిన్న నాటి నుండి తిరిగేటి దోస్తయినా
ఇప్పుడున్న పాటుగ ఇష్టాన్నిపెంచుకున్న
రోజు పక్క పక్క సీటులోనే కూచోని వెళుతున్న
నేడు వేలు తాకితేనే చక్కిలిగింతల్లో మునుగుతున్న
ఇన్నెండ్లకు ఈ కండ్లను నే సూటిగ సూడలేకున్నా
సాటుగ దాగుడుమూతల ఆటరా
నీ సేతీలో సెయ్యేసిమరి సెప్పాలని ఉన్నదిరా
లోపలేదో లొల్లి జరుగుతాంది వసపడుతలే నీ వల్లనే
రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు
రావేరా.....
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా.... రా.... రా.....
నిన్ను సూసుకుంట వందయేళ్ళైన బతికేస్తా
నీ పేరు తలసుకుంటా యెన్నాళ్ళైన ఉండి పోతా
నీ ఒక్కని కోసం లోకాన్ని మొత్తం ఒదిలేస్తా
నువ్వు పక్కనుంటే ఎక్కడికైనా కదిలొస్తా
ఏ ఘడియలో నువ్ నచ్చినవో
సచ్చిన నిను ఇడువను
ఈ పిచ్చిని ప్రేమంటావో ఏమంటావో
ఈ ఆశను అరిగొశను ఓ నిముషమునే సైసనురా
లగ్గమింక జేసుకోని నీ పిల్లలకు తల్లినైపోతాను
రాజు నా బాలరాజు
రాజు బంగారి రాజు
రాజు నా రారాజు
రావేరా.....
రాజు నా సక్కని రాజు
రాజు నా సుక్కల రాజు
రాజు నా ముద్దుల రాజు
రా.... రా.... రా.....
0 కామెంట్‌లు